దిల్లీ: ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ స్థానంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. మన్మోహన్ నియామకానికి వీలుగా దిగ్విజయ్ ఆ పదవికి రాజీనామా చేశారు. పట్టణాభివృద్ధి స్థాయీ సంఘంలో దిగ్విజయ్‌ను నియమించారు.
పార్లమెంటరీ స్థాయీ సంఘంలో మన్మోహన్