జైనథ్, : కార్తీక పౌర్ణమి సందర్భంగా జైనథ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో మంగళవారం ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. అర్చకులు ధీరజ్‌కుమార్ ఆధ్వర్యంలో వ్రతాలను భక్తులు ఆచరించారు. ఎంపీపీ మార్చెట్టి గోవర్దన్, జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మల అరుంధతి దంపతులతో పాటు వివిధ గ్రామాల నుంచి కుటుంబ సభ్యులతో తరలివచ్చిన 508 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.